* అవయవదానం చేస్తున్నట్లు ప్రకటన
* సభ్యులందరూ ముందుకు రావాలని సూచన
* అవయవదానం బిల్లుకు శాసనసభ ఆమోదం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అసెంబ్లీ సాక్షిగా అవయవదానానికి ముందుకు వచ్చారు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. (KTR) అవయవదానంపై జరిగిన చర్చ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. తాను అవయవదానానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మనం ప్రజాప్రతినిధులమని, అందరికీ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లోనూ అవయవదానంపై చైతన్యం తేవాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సభ్యులు ముందుకు వస్తే అసెంబ్లీ(ASSEMBLY)లోనే సంతకాలు చేద్దామన్నారు. అవయవదానంపై మొదటి సంతకం తానే చేస్తానన్నారు. అది గొప్ప మానవీయ చర్య అన్నారు. అవయవదానం మరింత మందికి జీవితం ఇస్తుందని వెల్లడించారు. అవయవదానం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ అంశంలో రాష్ట్ర విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్ర విధానానికి అనుగుణంగానే రాష్ట్రంలో అవయవదానం ఉంటుందని బిల్లు రూపొందించారు.
…………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
