* నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం
* పోలీసుల అదుపులో ఆరుగురు?
ఆకేరు న్యూస్, నాగర్‌కర్నూలు జిల్లా : తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై 8 మంది సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడ్డారు. ఆమె బహిర్భూమికి వెళ్లిన సందర్భంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం… మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యువతి ఊర్కొండపేటలోని ఆంజనేయస్వామి ఆలయానికి (Anjaneya Swamy Temple) వచ్చింది. దైవదర్శనం అనంతరం రాత్రి అక్కడే నిద్రపోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో కాలకృత్యాల కోసం సమీపంలోని గుట్టప్రాంతంలోకి వెళ్గగా అప్పటికే అక్కడ ఉన్న 8 మంది యువకులు యువతిని అడ్డుకున్నారు. ఆమె వెంట వచ్చిన బంధువుపై దాడిచేసి చేతులు కట్టేశారు. ఆపై యువతిని బలవంతంగా సమీపంలోని గుట్టల్లోకి తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి (Gang Rape)పాల్పడ్డారు. నిందితులను ఊర్కొండపేటకు చెందినవారిగా గుర్తించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
