* అంధ ఉద్యోగులను కోర్టుల చుట్టూ తిప్పడంపై హైకోర్టు ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులపై హైకోర్టు (High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. అంధులను కోర్టుల తిప్పిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. అధికారులే నిజమైన అంధులని జస్టిస్ నగేష్ భీమపాక (Justice Nagesh Bheemapaka) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్యాయంగా విధుల నుంచి తొలగించారని 2017లో కొందరు అంధ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. 8 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. వారంతా కోర్టుల చుట్టూ తిరగడానికి కారణమైన అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల తీరుతో అంధులు తీవ్రంగా నష్టపోయారని వ్యాఖ్యానించింది. కొందరి అంధ ఉద్యోగుల జీవితం మసకబారుతోందని ధర్మాసనం పేర్కొంది.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
