* ఎమ్మెల్సీ కవిత వివాదాస్పద వ్యాఖ్యలు
* మా కర్మ కాకపోతే నువ్వూ విమర్శించడమే : పవన్ అభిమానులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్దేశించి తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) చేసిన కామెంట్లు వైరల్గా మారాయి. ఆయన అనుకోకుండా ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అయిపోయారని పవన్ ఏమీ సీరియస్ పొలిటీషియన్ కాదని అన్నారు. ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ వ్యాఖ్యలపై స్పందనేంటని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా స్పందించారు. దురదృష్టవశాత్తూ పవన్ కల్యాణ్ (Pavan Kalyan) ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారని, చేగువేరా ఆదర్శాలు నచ్చిన వ్యక్తి ఇప్పుడు రైటిస్ట్ (బీజేపీ మద్దతుదారు) ఎలా అయ్యారని కవిత ప్రశ్నించారు. వైసీపీ మినహా దాదాపు ఏపీలోని అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నారని అన్నారు.. పవన్ కల్యాణ్ చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయని, అలాంటి వ్యక్తి గురించి తానేమీ చెప్పగలనని విమర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పవన్ అభిమానులు కూడా ఘాటుగానే స్పందించారు. కవితకు ఏ అర్హత ఉందని పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. గతంలో లిక్కర్ స్కామ్ (Liquor Scarm) లో కవిత అరెస్టైన విషయాన్ని గుర్తుచేస్తూ ఇలాంటి స్కామ్ లు చేస్తేనే సీరియస్ పొలిటీషియన్ అన్నట్లా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. మా ఖర్మ కాకపోతే చిప్ప కూడు తిన్న నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నావు! .. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
