
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన జాబ్ మేళా(Job Mela)లో తొక్కిసలాట కలకలం రేపింది. వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరలోని ఎం.కె.నాయుడు హోటల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో తరలివచ్చారు. అంచనాకు మించి నిరుద్యోగులు భారీగా తరలిరావడంతో నిర్వాహకులు అదుపు చేయలేకపోయారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దాంతో హోటల్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన భారీ అద్దాలు పగిలిపోవడంతో ముగ్గురు యువతులకు గాయాల్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు క్షతగాత్రులను ఎంజీఎం హాస్పిటల్(Mgm Hospital)కు తరలించి చికిత్స అందించారు. కాగా, ఇరుకుగా ఉన్న హోటల్లో భారీ కార్యక్రమాన్ని నిర్వహించడంపై పలువురు నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి రాక కోసం వెయిట్ చేయించడం కూడా ఈ తొక్కిసలాటకు కారణంగా పలువురు భావిస్తున్నారు.
………………………………………….