
నిమిష్యం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి నో
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఈ నెల 29 నుంచి ఈఏపీ సెట్ (EAPCET) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు, మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. రోజూ రెండు సెషన్లలో ఈఏపీ సెట్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 124 కేంద్రాల్లో ఈఏపీ సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇంజనీరింగ్ (Engineering) ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది హాజరుకానున్నారు. అగ్రికల్చర్(Agriculture), ఫార్మా (Pharma) పరీక్షకు 86,101 మంది హాజరుకానున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతి ఉండదని అధికారులు ప్రకటించారు. ఈఏపీ సెట్ (EAPCET) అనేది తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, ఫార్మసీ, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించబడతాయి.
………………………………………………