* 21,22 తేదీల్లో ఖరారైనట్లు సమాచారం
ఆకేరున్యూస్ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఆయన ఈనెల 21 నుంచి 22 వరకు అగ్రరాజ్యం యూఎస్‌లో పర్యటించనున్నారు. ఆ పార్టీ నేత పవన్ ఖేడా గురువారం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడిరచారు. ఏప్రిల్ 21, 22 తేదీల్లో రాహుల్‌గాంధీ యూఎస్ లో పర్యటిస్తారని ఖేడా తెలిపారు. ఈసందర్భంగా ఆయన రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీని సందర్శిస్తారన్నారు. ఆ వర్సిటీ-లోని విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడతారని తెలిపారు. దీనికి ముందు ఆయన ఎన్నారై సంఘ సభ్యులతో పాటు ఇండియా ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులతోను సమావేశమవుతారని వెల్లడిరచారు. ఇక, గతేడాది సెప్టెంబరులో రాహుల్ మూడ్రోజులు యూఎస్‌లో పర్యటించారు. ఈ పర్యటన సమయంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో రాహుల్ రిజర్వేషన్లు, భారత్‌లో మతస్వేచ్ఛ వంటి అంశాలపై మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు దేశీయంగా తీవ్ర దుమారం రేపాయి. సిక్కులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. భాజపా ఆయన మాటలను ఖండిరచింది. విదేశాల్లో భారత్ పరువు తీస్తున్నారని మండిపడిరది.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
