- ఉస్మానియా వైద్యులకు సీఎం అభినందనలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రభుత్వాసుపత్రుల పట్ల ఉస్మానియా వైద్యులు ప్రజల్లో గౌరవం పెంచారని సీఎం రేవంత్ రెడ్డి (REVANTHREDDY) తెలిపారు. ఉస్మానియా వైద్యులు అజ్మీరా, విక్రమ్ బృందం ఆదర్శంగా నిలిచారని అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సేవ చేస్తున్న ప్రతీ వైద్యుడు ఆదర్శనంగా నిలిచారని తెలిపారు. ప్రభుత్వ వైద్యులు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని నిరూపించారని కొనియాడారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అనే నానుడిని తిరగరాశారని అన్నారు. ఇటీవల షిర్డీకి వెళ్తున్న ఏపీకి చెందిన 22 ఏళ్ల యువకుడు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. అతన్ని అడ్మిట్ చేసుకునేందుకు ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది నిరాకరించగా.. అతడి కుటుంబ సభ్యులు వెంటనే ఉస్మానియాకు తరలించారు. అక్కడి వైద్యులు యువకుడిని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం అతను కోలుకున్నాడు. దీనికి సంబంధించిన కథనం ఓ దినపత్రికలో రావడంతో జపాన్లో టూర్లో ఉన్న సీఎం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిన ఉస్మానియా వైద్యులు (OSMANIA DOCTORS) డాక్టర్ రంగా అజ్మీరా,డాక్టర్ విక్రమ్ బృందం ఆదర్శంగా నిలిచారని అభినందించారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
