
* రజాకార్లను వ్యతిరేకించే పార్టీ బీజేపీ
* ప్రజలకు బీఆర్ ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలి
* ఎన్నికల సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీజేపీ.. రజాకార్లను వ్యతిరేకించే పార్టీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishanreddy) అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మజ్లిస్‌కు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోందని అన్నారు. మజ్లిస్ పార్టీకి కొమ్ము కాస్తూ అన్ని రకాలుగానూ కాంగ్రెస్(Congress), బీఆర్ ఎస్ (Brs) అండగా ఉంటున్నాయని విమర్శించారు. బీజేపీని ఓడించే ఏకైక లక్ష్యంతో ఆ రెండు పార్టీలూ పని చేస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Hyderaba Mlc Elections) ఆ పార్టీలు పోటీ చేయడం లేదని, మజ్లిస్ నాయకులకు జీహుజూర్ అని సలాములు కొడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ మతోన్మాద పార్టీ అని విమర్శిస్తున్నారని, బీజేపీ.. (Bjp) రజాకార్లను వ్యతిరేకించే పార్టీ అని వివరించారు. మజ్లిస్ పార్టీ ఏజెంట్‌గా కాంగ్రెస్.. కనుసన్నల్లో బీఆర్ ఎ స్ ఉన్నాయని విమర్శించారు.
…………………………………………