
* వాతావరణ శాఖ హెచ్చరిక
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లో నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి అతలాకుతలమైంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై ట్రాఫిక్ జామ్ (TRAFFIC JAM)అయింది. ఈదురుగాలులకు ఆబిడ్స్ లోని ఓ భవనంపై నుంచి ఏకంగా భారీ క్రేన్ కింద పడిపోయింది. ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది. తాజాగా వాతావరణ శాఖ మరోమారు హెచ్చరికలు జారీ చేసింది. నేటి సాయంత్రం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ (HYDERABAD)తో పాటు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి,మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని శనివారం పేర్కొంది. ఆదివారం కూడా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్(YELLO ALLERT)ని జారీ చేసింది.
…………………………………………..