ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ రామకృష్ణా రావు నియమితులైన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ప్రగతి భవన్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను సీఎస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణా రావుకు డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. 1991 ఐఏఎస్‌కు బ్యాచ్‌కు చెందిన రామకృష్ణా రావు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఆగస్టులో ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే సుదీర్ఘ కాలం ఆర్థిక శాఖలో చేసిన ఆయన సేవలను గుర్తించిన సర్కార్ అనుభవం దృష్ట్యా రామకృష్ణా రావును సీఎస్‌గా నియమించింది. గతంలో ఆయన నల్లగొండ జాయింట్ కలెక్టర్‌గా, గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కూడా పని చేశారు.
………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
