
– సత్తా చాటిన యంజేపి కమలాపూర్ బాయ్స్
ఆకేరు న్యూస్, కమలాపూర్: పదవ తరగతి ఫలితాల్లో మండల వ్యాప్తంగా 92.26% గా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం నమోదయింది. మండలంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు మొత్తం 17 పాఠశాలలు ఉండగా, జడ్పీహెచ్ఎస్ శనిగరం, భీంపల్లి, శ్రీరాములపల్లి, మరిపల్లిగూడెం, యంజెపి గురుకుల బాలుర,యంజెపి గురుకుల బాలికల పాఠశాలలు మాత్రమే 100% ఉత్తీర్ణత సాధించాయి. మండల వ్యాప్తంగా బాలికలు 92.7% శాతం, బాలురు 91% శాతం మంది పాస్ అయ్యారు.
మెరిసిన ఎం జె పి గురుకుల విద్యార్థులు మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు పదవ తరగతి ఫలితాలలో సత్తా చాటారనీ పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ తాడూరి రవీందర్ తెలిపారు. మండల వ్యాప్తంగా అత్యధికంగా కే.సాత్విక్ 572, మార్కులు సాధించి, కమలాపూర్ మండల టాపర్గా నిలిచాడు. కే .ధనుష్ 563, ఎన్.ఉదయ్ సాయి 559 మార్కులతో పాటు 25 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారు. మార్కులతో పాటు 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అద్భుతమైన ఫలితాలను సాధించిన విద్యార్థులను, అందుకు కారణమైన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులను ఆయన అభినందించారు.
…………………………………………..