* సీఎం రేవంత్ రెడ్డికి ఇది తగునా? : నారాయణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ అందాల పోటీలు నిర్వహించడం, స్త్రీ జాతిని అవమానించడమేనని సిపిఐ నారాయణ (NARAYANA) అన్నారు. అందాల పోటీలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో నారాయణ మేనకోడలు కావేరి ఫుడ్ ప్రొడక్ట్ షాపు ప్రారంభోత్సవానికి హాజరై షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. మా మేనకోడలు సింగపూర్(SINGAPUR)లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి పదిమందికి సేవ చేయాలని సంకల్పంతో స్వయం ఉపాధిని ఎంచుకుంది, పదిమందికి జీవనాధారం కల్పించడానికి ప్రయత్నించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సింగపూర్ నుంచి వచ్చి స్వశక్తితో ఎదగాలనే ఆలోచన స్త్రీ జాతి అందరికీ ఆదర్శం అన్నారు. కానీ హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (REVANTH REDDY) స్త్రీ జాతిని అవమాన పరుస్తూ అందాల పోటీలు నిర్వహించడం చూస్తుంటే ఆడవాళ్లను బజారులో పెట్టి అమ్మే పద్ధతిలో ఉందన్నారు. అందాల పోటీలు నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి లేదని, గొప్పగా 25 కోట్లు ఖర్చు పెడుతున్నానని చెప్పడం అత్యంత పవిత్రమైన స్త్రీ జాతిని మరింత అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
