* రూ.49 వేల కోట్లకు పైగా పనులు
ఆకేరు న్యూస్, అమరావతి : ఏపీ రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు ప్రధానమంత్రి మోదీ (MODI) హాజరయ్యారు. రాజధాని పనులు సహా రూ.58 వేల కోట్ల విలువైన పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. వాటిలో రాజధాని అమరావతి(Amaravathi)కి సంభంధించి 49వేల కోట్లకు పైగా పనులు ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచే రూ.8వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకూ ఆయన శంకుస్థాపన చేశారు. రాజధాని పనులు, నేషనల్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. 11 కీలక ప్రాజెక్టులు, 217 చ.కి.మీ. పరిధిలో రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించారు. 16.9 చ.కి.మీ. పరిధిలో కోర్ క్యాపిటల్, రాజధానిలో 30 శాతం పచ్చదనం, జలవనరులు ఉండనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే రైతులనుంచి 34,281 ఎకరాలు సేకరించారు. రాజధానిలో 9 థీమ్‌లతో 9 నగరాల నిర్మాణం, నార్మన్ పోస్టర్‌తో ముఖ్య కార్యాలయాల డిజైన్లు రూపొందించారు.
మోదీ సహకారం అవసరం
ఉగ్రవాదులను అరికట్టేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నా, దేశం మొత్తం ప్రధాని మోదీ వెంటే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు అని చెప్పారు. ఎప్పుడు గంభీరంగా ఉండే మోదీ.. ఉగ్రవాదుల దాడితో చలించిపోయారని, ఉగ్రవాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా, మీ వెంటే ఉంటామని ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు. ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో మోదీకి మా మద్దతు ఉంటుందన్నారు. సరైన కాలంలో దేశానికి సమర్థుడైన నాయకుడు మోదీ అన్నారు. పదేళ్లలో 15 కోట్ల మంది పేదరికాన్ని జయించారని తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక శక్తిగా ఎదుగుతోందన్నారు. 2027 నాటికి మూడో ఆర్థిక శక్తిగా భారత్ అవతరిస్తుందని, కులగణనతో అతిపెద్ద సంస్కరణ చేపట్టారని అన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న ఏపీకి మోదీ ఆక్సిజన్ ఇచ్చారని తెలిపారు. గత ఐదేళ్లు అమరావతి విధ్వంసం చూశామని, రైతుల పోరాటం వల్లే అమరావతి నిలబడిందని బాబు తెలిపారు.
………………………………………
