Telangana Paddy Procurement Record
* తెలంగాణలో ధాన్యం సేకరణలో రికార్డు
ఆకేరు న్యూస్, కమలాపూర్:
తెలంగాణ దేశంలోనే వ్యవసాయ రంగంలో ముందున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం 2025-26 సంవత్సరంలో వరి కొనుగోలులో అన్ని రికార్డులను తిరగరాసిందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 150 లక్షల టన్నుల వరిని కొనుగోలు చేసి, 26.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 35,537 కోట్లు నేరుగా జమ చేసింది.
రాష్ట్రంలోని 8,575 కొనుగోలు కేంద్రాలు ద్వారా ఈ సేకరణ జరిగిందనీ, కొనుగోలు నుంచి రవాణా, నిల్వ, మిల్లింగ్ వరకు సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పాటు చేయడంతో రైతులకు 48 నుంచి 72 గంటల్లోనే చెల్లింపులు అందించినట్లు పేర్కొంది.
రైతుల ఆదాయం పెంచడం, వారి సమస్యలను త్వరగా పరిష్కరించడం వంటి అంశాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితం ఇచ్చాయని అధికారులు తెలిపారు. ఈ రికార్డు సాధనతో రైతు సంక్షేమం మరింత ముందుకు సాగుతుందని రైతు సంఘాలు స్వాగతం తెలిపినట్టు ఎక్స్ లో పేర్కొంది.
