* తొక్కిసలాటలో ఆరుగురు దుర్మరణం
* మరో 50 మందికి పైగా గాయాలు
* రాష్ట్రపతి, ప్రధాని విచారం
ఆకేరు న్యూస్, డెస్క్ : గోవా రాష్ట్రంలోని శిర్గావ్లో ఉన్న లైరాయ్ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జాతర సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయినట్టు తెలుస్తోంది. మరో 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఏటా వైశాఖ శుద్ధ పంచమి రోజున ఇక్కడ వైభవంగా జాతర జరుగుతుంది. ఈ జాతరను పుస్కరించుకొని అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు దర్శనానికి వచ్చారు. అయితే ఇక్కడి ఆయలంలో నిప్పుల గుండం తొక్కడం అనేది అనాదితా వస్తున్న ఆచారం. ఈ క్రమంలో శనివారం ఉదయం నిప్పుల గుండం తొక్కే తంతు మొదలు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇందులో పాల్గొన్నారు. ఒక్కసారిగా భక్తు రద్దీ పెరగడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు సాగే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది. పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలతో పాటు, గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరామర్శించారు.
దురదృష్టకరం : రాష్ట్రపతి ముర్ము
శిర్గావ్లో ఉన్న లైరాయ్ ఆలయంలో తొక్కిసలాట దురదృష్టకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Murmu) విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలువాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానన్నారు.
బాధాకరం : ప్రధాని మోదీ
తొక్కిసలాటలో ప్రాణ నష్టం చాలా బాధాకరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక పరిపాలనా సంస్థ బాధిత కుటుంబాలకు సాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
……………………………………………..
