– డెలివరీ కోసం వచ్చిన మహిళ కడుపులోనే దూదిని మర్చిపోవడం చాలా బాధాకరం.
– హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, కమలాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రిల పరిస్థితి దయనీయంగా మారిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమలాపూర్ లో అద్భుతమైన ఆసుపత్రిని పేద ప్రజల కోసం నిర్మించారని, ఆసుపత్రి లో సరైన వైద్య సేవలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.నిన్న కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన డాక్టర్ల నిర్లక్ష్యపు చికిత్స పైన కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డెలివరీ కోసం వచ్చిన మహిళ కడుపులోనే దూదిని మర్చిపోవడం చాలా బాధాకరమని,ఇది పూర్తిగా డాక్టర్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. బాధ్యులైన వైద్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బాధిత మహిళకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
