* భారత్- పాకిస్థాన్ వార్ ఎఫెక్ట్..
ఆకేరున్యూస్, న్యూఢల్లీి: భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో అందాల పోటీల నిర్వహణపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే అందాల పోటీలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో విశ్వహిందూ పరిషత్ పోటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. అంతర్జాతీయ ఈవెంట్ మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యము వహిస్తోంది. మే 10 నుంచి 31వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ పోటీలకు ప్రభుత్వం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది. 120కి పైగా దేశాల అందగత్తెలు, ప్రతినిధులు, స్పాన్సర్స్ ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారు. ఇప్పటికే పలు దేశాల అందాల భామలు హైదరాబాద్ చేరుకున్నారు.
మిస్ వరల్డ్ 2025 పోటీలు రద్దు?
ఈ క్రమంలో అందాల పోటీల నిర్వహణపై సస్పెన్స్ నెలకొంది. పాకిస్థాన్- భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపధ్య్మలో పోటీలను నిర్వహించాలా..వద్దా అనే ఆలోచనలో పడిరది రాష్ట్ర ప్రభుత్వం. ఈమేరకు మరికాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
