Cult Movie
* అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల
ఆకేరు న్యూస్: మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కల్ట్ తారక్ సినిమాస్, వన్మయ్ క్రియేషన్స్ బ్యానర్లపై సందీప్ కాకర్ల నిర్మిస్తున్న ఈ సినిమాకు విశ్వక్సేన్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇండియాస్ ఫస్ట్ అథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
నిజ జీవితంలో జరిగిన కొన్ని కలవరపరిచే ఘటనల నుంచి స్ఫూర్తి పొంది డార్క్, ఇంటెన్స్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌గా కల్ట్ ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. స్నేహాన్ని పరిచయం చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ సింగిల్‌కు కూడా మంచి స్పందన వచ్చింది.
తాజాగా కల్ట్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ థ్రిల్లింగ్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు. అక్టోబర్ 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ గ్లింప్స్‌లో విశ్వక్సేన్ ఇంటెన్స్ లుక్, కిల్లింగ్ స్ప్రీ, కోపంతో కూడిన యాటిట్యూడ్ ఆకట్టుకున్నాయి. ఇందులో విశ్వక్సేన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు గ్లింప్స్ హింట్ ఇచ్చింది.
రవి బస్రూర్ అందిస్తున్న పల్సేటింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై ఉత్కంఠను మరింత పెంచుతోంది. గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్, EZY యజ్ఞ తుర్లపాటి, కబీర్ భారతీయ, విశాఖ్ నాయర్, చెపూరి వివేక్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించగా.. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అరవింద్ మ్యూల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెలుగు, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, స్పానిష్ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
