Urea Booking
Urea Booking: ఆకేరు న్యూస్, కమలాపూర్: రైతులకు ఎరువుల కొనుగోలును మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల ద్వారా యూరియా, ఇతర ఎరువులను బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని కమలాపూర్ మండల వ్యవసాయ అధికారి వేణు తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
* స్మార్ట్ఫోన్ ఉన్న రైతులు
ప్లే స్టోర్ నుంచి FFS యాప్ను డౌన్లోడ్ చేసుకుని తమకు అవసరమైన ఎరువులను నేరుగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. స్మార్ట్ఫోన్ లేని రైతులు సమీపంలోని మీ-సేవ కేంద్రాలను ఆశ్రయించి యూరియా, ఇతర ఎరువులను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా ముందుగానే బుకింగ్ చేసుకుని ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ అధికారి వేణు కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
