* రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో మరో ఆధ్మాత్మిక కార్యక్రమానికి వేళయింది. మహత్తర ఘట్టానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే సరస్వతి పుష్కరాలు(Saraswati Pushkaralu) . ఈ నెల 15 నుంచి పుష్కర స్నానాలు ప్రారంభం కానున్నాయి. 26 వరకు పుష్కర పుణ్యస్నానాలు రాష్ట్రంలో మహాప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వరంలో పుణ్యక్షేత్రం లో కొనసాగనున్నాయి. రాష్ట్రంలో మహాప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ముక్తీశ్వర పుణ్యక్షేత్రం సరస్వతీ పుష్కరాలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పుష్కర స్నానాలకు తెలంగాణతోపాటు ఏపీ(AP), ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర(MAHARASTRA), కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ప్రతిరోజూ దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. దీనికి తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఒక్క కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతుండటం విశేషం. ఇంకో విశేషం ఏంటంటే.. తెలంగాణ (TELANGANA) రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి పుష్కరాలు ఇవే . ఇది సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సరస్వతి నదిని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహిని (అదృశ్య నది)గా పరిగణిస్తారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఆచరిస్తారు. మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం ప్రారంభం కానుంది. మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉంటుందని కాళేశ్వరం పుణ్యక్షేత్ర ఆలయ అర్చకులు తెలిపారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
