* భారత్ లోనూ పెరుగుతున్న కరోనా కేసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దక్షిణ ఆసియా దేశాల్లో ఇప్పటికే కరోనా (Carona) విజృంభిస్తోంది. సింగపూర్, థాయిలాండ్ కేసులు పెరుగుతున్నాయి. చైనాలో ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయి. ఈక్రమంలో భారత్ దేశంలోనూ స్వల్పంగా కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కేరళ(Kerala), మహారాష్ట్ర(Maharastra), తమిళనాడు(Tamilanadu)లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం దేశ వ్యాప్తంగా 257 కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో కరోనా టెన్షన్ మళ్లీ మొదలైంది. దీంతో తగిన చర్యలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచిస్తోంది. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్‌లో మాస్క్ తప్పనిసరి చేశాయి. అయితే భారత్ లో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపింది. భారత్ లో నమోదయిన 257 కోవిడ్ కేసుల్లో తీవ్రత కొద్దిగానే ఉందని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచి ఈ కోవిడ్ కేసులు (Covid) వ్యాప్తి చెంది ఉంటాయని భావిస్తున్నారు.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
