* మృతుల్లో మావోయిస్టు కీలక నేత?
ఆకేరు న్యూస్, డెస్క్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ (Encounter)లో అధిక సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటి వరకు 28 మంది మృతి చెందినట్లు భద్రతా దళాలు ధ్రువీకరించాయి. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (Basavaraju) మరణించినట్లు ప్రచారం జరుగుతోంది. బసవరాజు ఉన్నారనే సమాచారంతోనే మాద్ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. బసవరాజుపై రూ.కోటిన్నర రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన స్వస్థలం జిల్లా శ్రీకాకుళం. ఈరోజు ఉదయం మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోలు మృతిచెందగా.. మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ DRG బలగాలు భారీగా పాల్గొన్నాయి. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పలు కొకాగా, ఇవాళ (బుధవారం) ఉదయం నుంచీ భద్రతా బలగాలు, నక్సల్స్కి మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
