Padi Kaushik Reddy
* నేడు ఎథిక్స్ కమిటీ కీలక చర్చ
ఆకేరు న్యూస్ ,హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నేడు కీలకంగా సమావేశం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఎథిక్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై తదుపరి చర్యలు తీసుకునే అంశంపై కమిటీ ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.
కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఇప్పటికే అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆయనకు వివరణ ఇవ్వాలని కమిటీ కోరగా.. కౌశిక్ రెడ్డి తన సమాధానాన్ని కమిటీకి అందజేశారు. అయితే ఆయన సమర్పించిన వివరణపై కమిటీ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో నేడు జరిగే సమావేశంలో కౌశిక్ రెడ్డి ఇచ్చిన రిప్లైపై మరోసారి చర్చించి.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కమిటీ చర్చలు, అందుబాటులో ఉన్న వివరాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
