
* వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
* 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం
* పదేళ్లలో చేయలేని అభివృద్ధి 15 నెలల్లో చేశాం
* మాది చేతల ప్రభుత్వం
* ప్రతి పక్షాలు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నాయి
ఆకేరున్యూస్, హన్మకొండ: ఇంటిగ్రేటెడ్ స్యూల్ నిర్మాణం వరంగల్ పశ్చిమ నియోజక వర్గ అభివృద్ధిలో ఓ మైలు రాయి వంటిదని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 4వేల కోట్లతో రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. అందులో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రూపాయలు 2వదంల కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే విద్యా హబ్‌గా ఉన్న వరంగల్ నగరానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఓ మణిహారం లాంటిదని ఎమ్మెల్యే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను మంజూరు చేయడం హర్షనీయమనిఅన్నారు. స్కూల్ ఏర్నాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల కోట్లు కేటాయించిందని ఎమ్మెల్యే అన్నారు. స్కూల్ నిర్మాణానికి స్థల సేకరణ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ముందుందన్నారు.
రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చూసి కొందను ఓర్వలేక పోతున్నారని ఆయన ప్రతిపక్ష పార్టీనుద్దేశించి అన్నారు. కులమతాలకతీతంగా. రాజకీయాలకతీతంగా ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.వరంగల్ నియోజక వర్గ అభివృద్దికి ముఖ్యమంత్రి రేవంత రెడ్డి అన్ని విధాల సహకరిస్తున్నారని ఎమ్మెల్యే నాయిని అన్నారు. ప్రతీ పేద పిల్లాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనేదా రాష్ట్ర ప్రభుత్వం ఉద్దశ్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు ప్రభుత్వ అమలు చేస్తున్న అన్ని పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
…………………………..