ఆకేరున్యూస్, కమలాపూర్: కమలాపూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్స్, పరిశ్రమలు,వాణిజ్యం,శాసన వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 56వ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దూడ శ్రీకాంత్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ కూడలి వద్ద కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తవుటం ఝాన్సీ రాణి- రవీందర్,మార్కెట్ డైరెక్టర్ మిల్కూరి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండపు చరణ్ పటేల్ ,బాలసాని రమేష్ గౌడ్, పోడేటి బిక్షపతి, కొండపాక మనీష్, మాట్ల రవీందర్, పెరుమాండ్ల పరుశరాములు, విష్ణు దాసు వంశీధర్ రావు, పైసా శరత్ ఆడపు శ్రీకాంత్, దర్మల శ్రీకాంత్ గూడెపు మొగిలయ్య,డాక్టర్ యుగంధర్, డాక్టర్ రాజు,ఆన్ కార్ అశోక్, మస్న చంద్రశేఖర్, మాట్ల రాజేష్, వైనాల వంశీ, తదితరులు పాల్గొన్నారు.మంత్రి శ్రీధర్ బాబు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
