* కార్ల్ సన్ వీడియో వైరల్
ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ డెస్క్ : చెస్ ప్రపంచంలో సంచలనాలను క్రియేట్ చేస్తున్న గుకేశ్ మరో రికార్డును నెలకొల్పారు. తన ఎత్తులు, పైఎత్తులతో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడిని ఓడించారు. నార్వే చెస్ టోర్నమెంట్ 2025లో చోటుచేసుకున్న ఒక పరిణామం హాట్ టాపిక్‌గా మారింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గుకేశ్ చేతిలో ఓటమిని భరించలేని మాజీవరల్డ్ చాంపియన్ కార్ల్ సన్ తన పిడికిలితో ఒక్కసారిగా చెస్ బోర్డు టేబుల్ ను గట్టిగా కొట్టాడు. ఆ వెంటనే తన తప్పును గుర్తించిన అతను.. గుకేశ్ కు రెండుసార్లు సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రపంచ చెస్ చరిత్రలో మేటి ఆటగాడైన కార్ల్ సన్ ను ఆరో రౌండ్లో క్లాసికల్ టైమ్ కంట్రోల్లో ఓడించారు. ప్రపంచ నంబరు మూడో స్థానంలో ఉన్న గుకేశ్.. ప్రపంచ చాంపియన్ ను ఓడించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. సొంతగడ్డ మీద జరిగిన మ్యాచ్ లో మాగ్నస్ పైచేయి సాధించినప్పటికీ, ఒత్తిడి చిత్తు చేస్తూ గుకేశ్ తన ఆటను డిఫెన్స్ లో ఆడి.. చివర్లో ప్రత్యర్థిని బోల్తా కొట్టించిన వైనం ఆసక్తికరంగా మారింది.
………………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
