* భూభారతి ద్వారా ప్రజల దగ్గరకే అధికారుల రాక
* మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరున్యూస్, జనగామ: ధరణి పోర్టల్‌కి భూభారతి పోర్టల్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంతా తేడా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూ భారతితో రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా నడుస్తున్నామన్నారు. సోమవారం పాలకుర్తిలో మంత్రి పొంగులేటి విూడియాతో మాట్లాడుతూ.. . జూన్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి ద్వారా అధికారులు ప్రజల దగ్గరకే వస్తారని చెప్పారు. జూన్ 3 నుంచి 20 తేదీ వరకు రెవెన్యూ వ్యవస్థే విూ గ్రామానికే వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ఆగస్టు 15 నాటి భూ సమస్యలు పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని మండలాల్లో -టైనింగ్ ఇచ్చిన సర్వేయార్లతో సర్వే జరుగుతుందని తెలిపారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లు ప్రభుత్వం విడుదల చేస్తోందన్నారు. ఇళ్లు రాలేదని ఎవరు ఆందోళన, నిరుత్సాహపడవద్దని.. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ స్కీమ్ నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిరుపేదైన ప్రతి ఒకరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. రాబోయే రోజుల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ఎవరూ ఊహించని విధంగా అప్లికేషన్లు వచ్చాయన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో అక్రమాలు జరగొద్దని.. ఒక్క అనర్హుడికి కూడా లబ్ది జరగొద్దనే ఉద్దేశంతోనే స్కీమ్ ఇంప్లిమెంట్కు కొంత ఆలస్యం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలతో రెండు మూడు పర్యాయాలు ఇంతకుముందే చర్చించామని తెలిపారు. జూన్ 5న జరగబోయే కేబినెట్ భేటీలో ఉద్యోగుల సమస్యలపైన చర్చిస్తామని తెలిపారు. ఉద్యోగులను మా ప్రభుత్వం గౌరవిస్తుందని.. అదే విధంగా ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
