
* ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం
* మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆ కుటుంబమంతా ఓ బంధువు కుటుంబంలో జరిగిన పెళ్లి వేడుకకు వెళ్లారు. పెళ్లి వేదికలో సందడి చేశారు. బంధుమిత్రులతో సంతోషంగా గడిపారు. అంతలోనే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటికి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మధ్యప్రదేశ్ (Madyapradhesh) రాష్ట్రం ఝబువా జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన కొందరు వివాహ కార్యక్రమాన్ని ముగించుకొని తమ గ్రామానికి వ్యాన్‌లో వెళ్తున్నారు. అదే సమయంలో సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న ట్రైలర్ ట్రక్కు.. సంజేలి రైల్వే క్రాసింగ్ (Sanjeli railway crossing) వద్ద తాత్కాలిక రహదారి గుండా నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి దాటుతుండగా అదుపు తప్పింది. పక్కన వెళ్తున్న వ్యాన్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లోని తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడినట్లు ఝబువా పోలీసు సూపరింటెండెంట్ పద్మవిలోచన్ శుక్లా తెలిపారు. బాధితులు ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులను ముఖేష్ (40), సావ్లి (35), వినోద్ (16), పాయల్ (12), మధి (38), విజయ్ (14), కాంత (14 ), రాగిణి (9), అకాలి (35), పాయల్ సోమ్లా పర్మార్ (19 ), అషు (5 )గా గుర్తించారు.
…………………………………………………..