* కేటీఆర్, కవిత పంచాయితీ కాంగ్రెస్కు అవసరం లేదు
* మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాజకీయ ఉనికి కోసమే ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) పోరాడుతున్నారని, కవిత, కేటీఆర్ మధ్య పంచాయితీ కాంగ్రెస్ కు అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి పునః ప్రారంభంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి పలు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వార్తల కోసమే లేఖలు రాశారని విమర్శించారు. కవిత అంశం టీ కప్పులో తుఫాను లాంటిందని అన్నారు. విచారణకు ఎవరిని పిలవాలనేది కాళేశ్వరం కమిషన్ ఇష్టమని పొన్నం అన్నారు. నీళ్లు ఇస్తే సంతోషమే.. కానీ, నీళ్లలా తెలంగాణ ధనాన్ని బీఆర్ఎస్ హయాంలో దోచుకున్నారని ఆయన విమర్శించారు. సత్వర సమస్యల పరిష్కారం కోసం మంత్రుల ముఖాముఖి కార్యక్రమం ఉపయోపగపడుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. గత కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు.. హన్ముంతుని గుడి లేని గ్రామం లేదు అనే నానుడి ఉండేది. మళ్లీ అదే నినాదంతో పనిచేస్తున్నామని పొన్నం వెల్లడించారు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
