
* చిన్నస్వామి స్టేడియంలో ఆర్ సి బి విజయోత్సవ వేడుకలు
* భారీగా తరలివచ్చిన అభిమానులు
* తొక్కిసలాటలో ఏడుగురు మృతి పలువురికి గాయాలు
ఆకేరు న్యూస్, బెంగళూరు: ఆర్ సి బి జట్టు ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకున్న సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఐపిఎల్ మొదలైనప్పటినుండి మొదటిసారి బెంగళూరు జట్టు ఈ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఈ ట్రోఫీ కోసం అభిమానులు ట్రోఫీ గెలవడంతో ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలను ఏర్పాటు చేసింది.బెంగళూరు జట్టు ట్రోఫీ గెలుచుకోవడంతో స్థానికులు, క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో చిన్న స్వామి స్టేడియం కు చేరుకోవటంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందారు. పలువురికి గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
……………………………………………………………