– హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ చొరవతో పూర్తి కానున్న పెండింగ్ పనులు
– కమలాపూర్ వ్యవసాయ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి- రవీందర్
ఆకేరు న్యూస్, కమలాపూర్: హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ చొరవతో కమలాపూర్ మండలంలోని డబుల్ బెడ్రూం ఇండ్ల పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలోనే నిరుపేదలకు అందించనున్నట్లు కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి-రవీందర్ అన్నారు. సోమవారం కమలాపూర్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మండల ఎంపీడీవో గుండె బాబుతో కలిసి సందర్శించారు . అనంతరం మీడియాతో మాట్లాడుతూ…2018 లో కమలాపూర్‌లో 350, గూడూరులో 50 , మర్రిపల్లిగూడెంలో 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని గత బిఆర్ఎస్ ప్రభుత్వం 8 సంవత్సరాల క్రితం ప్రారంభించి, అసంపూర్తిగా వదిలేసిందని అన్నారు.అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించి రాష్ట్ర గృహ నిర్మాణాశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , రవాణా, బీసీ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లామని, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ బాబు చొరవతో హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించి పెండింగులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్,ఎలక్ట్రిసిటీ,వాటర్ సప్లై, రోడ్లు, డ్రైనేజ్ తదితర పనులు త్వరితగతన పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నారని అన్నారు. త్వరలోనే పెండింగ్ పనులు పూర్తి చేసి ,అర్హులైన పేదలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించబోతుందని ఆయన అన్నారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వాణిజ్య సెల్ అధ్యక్షులు కంభంపాటి ప్రసాద్, గూడెపు మొగులయ్య, కూచన నర్సింగం తదితరులు పాల్గొన్నారు
………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
