* సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫార్ములా -ఈకారు రేసులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు ఏసీబీ మరోసారి నోటీసులు అందజేసింది. ఈనెల 16 సోమవారం రోజున విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈకేసులో గతంలో ఒకసారి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. జనవరి 9న ఆరున్నర గంటలపాటు కేటీఆర్ ను ఏసీబీ విచారణ జరిపింది. ఆ తర్వాత మే 28న మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే, అమెరికా పర్యటన నేపథ్యంలో ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో మూడోసారి ఆయనకు నోటీసులు ఇచ్చారు అధికారులు. సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫార్ములా ఈకారు రేసు(FORMULA E CAR RACE)లో గతేడాది మే 29న ఏసీబీ ఎఫ్ ఐఆర్ నమోదు చేసింది.
………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
