* దమ్ముంటే విచారణకు హాజరు కావాలి
* ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సవాల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ ప్రభుత్వ విప్, వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (ADI SRINIVAS) ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ కు ఫార్ములా ఈ కారు (FORMULA E CAR RACE) రేస్ కేసు భయం పట్టుకుందని విమర్శించారు. దమ్ముంటే విచారణకు హాజరై నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ కేటీఆర్ కు శిక్ష తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాటలు చెప్పడం కాదని, విచారణకు సహకరించాలని అన్నారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి కేటీఆర్కు ఫార్ములా-ఈ రేసు నిర్వహణ కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీ (సోమవారం) ఉదయం 10 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా శుక్రవారం జారీ చేసిన నోటీసుల్లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
