* పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి
ఆకేరు న్యూస్, జనగామ: పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు పనిచేస్తానని కార్యకర్తలు నాకు అండగా ఉండాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి కోరారు. శనివారం దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు. కొలుకొండ, అప్పిరెడ్డిపల్లి, చౌడూరు గ్రామాలలో సిఆర్ఆర్ నిధుల ద్వారా మంజూరైన రూ.35 లక్షల రూ, సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనుల ప్రారంభానికి శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. కొలుకొండ గ్రామానికి రూ.12 లక్షలు, అప్పిరెడ్డిపల్లి గ్రామానికి రూ. 8 లక్షలు, చౌడూరు గ్రామానికి రూ.15 లక్షలు చొప్పున నిధులు మంజూరు అయ్యాయని యశస్విని రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. ప్రతి ఒక్క గ్రామంలో మౌలిక వసతులు, రహదారి వ్యవస్థ, పారిశుధ్య వాతావరణం మెరుగుపడాలని మా సంకల్పం. రోడ్లు మరియు డ్రైనేజీలు వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయి. కొలుకొండ, అప్పిరెడ్డిపల్లి, చౌడూరు గ్రామాల ప్రజలకు తగిన రహదారి, మురుగు నీటిపారుదల వసతులు అందించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయనీ అన్నారు. ప్రతి రూపాయి ప్రజల అవసరాల కోసం ఖర్చవ్వాలని పనులు నాణ్యతతో, వేగంగా పూర్తవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు కొనసాగుతున్న నా ప్రయాణానికి మీ అందరి సహకారం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, కొడకండ్ల మార్కెట్ చైర్ పర్సన్ నల్ల అండాలు, మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, మండల స్థాయి అధికారులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, పాల్గొన్నారు.

………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
