* కార్పొరేషన్ నిధులకు అక్రమంగా వాడుకున్నారు
* కేటీఆర్ కు నోటీసులిస్తే కవిత పెడబొబ్బలు పెడుతున్నారు
* వరద బాధితులకు సాయం చేస్తామని మోసం చేశారు
* అధికారంలో ఉండగా 32 కేసులు బనాయించారు
* బీఆర్ ఎస్ నాయకులను దేవుడు కూడా కాపాడలేడు
* వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఆకేరు న్యూస్, హనుమకొండ ః బీఆర్ ఎస్ నేతలు మాట్లాడుతున్న తీరు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉన్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
విచారణలో బాఘంగా కేటీఆర్ కు నోటీసులు ఇస్తే కవితకు వచ్చే నష్టం ఏంటని నాయిని ప్రశ్నించారు. మొన్న దయ్యంగా కన్పించిన అన్న ఇవ్వాళ్ల దేవుడుగా కన్పిస్తున్నాడా అని నాయిని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ఎన్నికల వేళ వరంగల్ కార్పొరేషన్ కు చెందిన నిధులను అక్రమంగా వాడుకున్నారని నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. అవినీతి కి కేరాఫ్ అడ్రస్ బీ ఆర్ ఎస్ నాయకులు అని నాయిని అన్నారు. వరదల వచ్చి నయీంనగర్ బ్రిడ్జి కొట్టుకుపోగా వరద బాధితులకు సహాయం చేస్తామని హామీ ఇచ్చి బాధితులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. అభివృద్ధి పనుల కేటాయింపులో తక్కువ కోడ్ ఇచ్చిన వారికే పనులను కేటాయించడం జరుగుతోందన్నారు. ఎక్కడా అవినీతి లేకుండా పారదర్శకంగా ముందుకు పోతున్నామన్నారు. తాను అవినీతికి పాల్పడినట్లు కేటీఆర్ నిరూపిస్తా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు నాయిని తెలిపారు.బీ ఆర్ ఎస్ హయాంలో తనపై 32 తప్పుడు కేసులు బనాయించారని నాయిని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తలుచుకుంటే ఏమైనా చేయగలం కాని కక్ష సాధింపు తమ విధానం కాదని నాయిని అన్నారు. బీ ఆర్ ఎస్ లో ఉద్యమకారులకు చోటు లేదని అన్నారు. వారు పార్టీ నుంచి వెళ్లగొడితే కాంగ్రెస్ లో చేరుతున్నారని నాయిని అన్నారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సరిఅయిన విధంగా బు్ది చెప్పారని గుండు సున్నాను చేతికి ఇచ్చారని అయినా బీఆర్ ఎస్ నాయకులకు బద్ది రావడం లేదని అన్నారు. బీ ఆర్ ఎస్ నాయకులను ఇక ఆ దేవుడు కూడా కాపాడలేరని నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు.
……………………………………………..
