Uppal Guru Purnima Celebrations
ఆకేరు న్యూస్, కమలాపూర్ :
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ లో గురుపౌర్ణమి వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.
వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం భక్తులకు ఆలయ ప్రాంగణంలో మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రమా నాగరాజు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాయినేని తిరుపతి రావు మాట్లాడుతూ… గురుపౌర్ణమి పర్వదినాన సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మారపల్లి నవీన్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మిల్కూరి శ్రీనివాస్, ఉప సర్పంచ్ మేడిపల్లి సిద్ధార్థ, వార్డు సభ్యురాలు నాయినేని సుచరిత శ్రీనివాస్, ఆలయ చైర్మన్ మహారాజు స్వామి, మాజీ సర్పంచ్ ర్యాకం మొండయ్య, దేశిని శ్రీనివాస్, ర్యాకం గట్టయ్య, జక్కుల వీరస్వామి, మొండెద్దుల రాజమౌళి, చెట్టి సుందరయ్య, అమృత మల్లయ్య, బొనగాని రవి, శరత్, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
