* కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషన్ లేఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీల విషయంలో న్యాయ విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Kaleshwaram Commission)ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(Kcr), మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావును కమిషన్ విచారించింది. వారికి పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టింది. వారి చెప్పిన సమాధానాలు నిజమా, కాదా తెలుసుకునేందుకు తాజాగా మరో చర్యకు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission)లేఖ రాసింది. గత ప్రభుత్వంలోని క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని కోరింది. అయితే క్యాబినెట్ మినిట్స్ కోసం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ లేఖ రాయడం ఇది తొలిసారి కాదు.. గతంలోనూ రెండు సార్లు లేఖలు రాసింది. ఇంజనీర్లు ఓపెన్ కోర్టు స్టేట్మెంట్ తర్వాత ఓ సారి, ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి కూడా కమిషన్ లేఖ రాసింది. కేసీఆర్ విచారణ అనంతరం ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. కానీ క్యాబినెట్ మినిట్స్ బయటికి ఇవ్వడానికి వీలు కాదని అధికారులు అంటున్నారు. కమిషన్ వరుస లేఖల నేపథ్యంలో ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఇవ్వాలి అంటే ఆ విషయాన్ని క్యాబినెట్లో చర్చించాల్సి ఉంటుం దని పేర్కొంటున్నారు.
…………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
