* కలైంజర్ కరుణానిధి యూనివర్సిటీ బిల్లు
పెండింగ్
* గవర్నర్ వ్యవహారశైలిపై అసంతృప్తి
* కేంద్రం ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
ఆకేరు న్యూస్ డెస్క్ : కలైంజర్ కరుణానిధి పేరుతో యూనివర్సిటీ ఏర్పాటుకు సంబందించిన ఫైల్‌ను గవర్నర్ ఆర్ఎన్ రవి కావాలనే ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారని తమిళనాడు సీఎం స్థాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. తంజావూరులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంజావూరుకు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి రాజకీయపరంగా, సాహిత్యపరంగా విడదీయలేని అనుబంధం ఉండేదన్నారు. ఆ కారణంగానే ఇక్కడ కలైంజర్ పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని శాసనసభలో బిల్లు ఆమోదించి పంపితే గవర్నర్ ఇప్పటివరకూ ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచారని ఆరోపించారు.సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహారశైలి మారలేదని స్టాలిన్ అన్నారు.సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహారశైలి మారలేదని స్టాలిన్ ఆరోపించారు.డీఎంకే ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక అన్నాడీఎంకే నేత లు అదేపనిగా విమర్శలు చేస్తుండగా, మరో వైపు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లా గవర్నర్ వ్యవహరిస్తూ ప్రభుత్వ పథకాలకు అడ్డుకట్ట వేస్తున్నారని ఆరోపించారు.
…………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
