* జూబ్లీహిల్స్ పీఎస్‌కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
* సాక్ష్యం రికార్డు చేసిన పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన సాక్ష్యాన్ని పోలీసులు రికార్డు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేశ్ కుమార్ ఫోన్ ను ట్యాప్ చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఆ సమయంలో తన ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ప్రణీత్ రావును అరెస్ట్ చేసి ఆయనకు సంబంధించి ఫోన్లను రికవరీ చేసిన సమయంలో అందులోని డేటాను విశ్లేషించగా.. మహేష్ కుమార్ గౌడ్‌కు చెందిన అంశాలు బయటపడ్డాయి. దీంతో ఆయన ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మహేష్ కుమార్‌ను బాధితుడిగా భావించి ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ పీఎస్ కు చేరుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ ఇచ్చిన వెళ్లిన తర్వాత ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు వచ్చే అవకాశం ఉంది. గద్వాల మాజీ జడ్పీ చైర్మన్ సరిత, ఎంపీ అనిల్ కూడా పీఎస్‌కు వచ్చారు.
……………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
