* వరద జలాలను మాత్రమే వినియోగిస్తాం
* ఏపీ మంత్రి నిమ్మల పవర్ పాయింట్ ప్రజంటేషన్
ఆకేరు న్యూస్, అమరావతి : వరద జలాలను మాత్రమే బనకచర్లకు తరలిస్తామని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Rama Naidu) తెలిపారు. బనకచర్ల (Banakacharla) ప్రాజెక్టుపై తెలంగాణ నేతల విమర్శల నేపథ్యంలో ఆయన అమరావతిలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎటువంటి నష్టమూ లేదన్నారు. సీడబ్ల్యూసీకి ప్రాథమిక నివేదిక సమర్పించామని, అన్ని అనమతులు వచ్చాకే ప్రాజెక్టు మొదలు పెడతామని వెల్లడించారు. ప్రాథమిక నివేదిక అనంతరమే డీపీఆర్ పంపుతామన్నారు. రోజుకు 2 టీఎంసీల చొప్పున బనకచర్లకు తరలించి రాయలసీమకు వినియోగించేలా ప్రాజెక్టు రూపొందించబడిందన్నారు. గత 30 సంవత్సరాలుగా గోదావరి నది నుంచి ఏటా 3000 టీఎంసీల నీరు గోదావరిలో కలుస్తున్నదని, వాటిని వినియోగించుకోవాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. పోలవరం (Polavaram) వద్ద లభ్యమయ్యే గోదావరి జలాలను మాత్రమే వినియోగించుకుంటామని నిమ్మల వివరించారు. నికర జలాలను ఎక్కడా వాడబోమని స్పష్టం చేశారు.
………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
