సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంముగ్గురు యువకుల మృతి
* విధి వక్రించి విషాదం
* ఎల్లమ్మ పండగ ఏర్పాట్లలో కుటుంబం
* మేకను కొనేందుకు ఆటోలో వెళ్తున్న కుటుంబసభ్యులు
* ఆటో బస్సు ఢీకొని మహిళ మృతి
* మహబూబాబాద్ జిల్లాలో ఘటన
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఎల్లమ్మ పండగ ఏర్పాట్లలో ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలోకి నెట్టివేయబడింది.జిల్లాలోని బయ్యారం మండలం జగత్ రావు బోటి తండాకు చెందిన సోదరులు మాలోతు సురేష్,గణేష్‌లు కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో కురవి అంగడికి బయలుదేరిన క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది.. ఎల్లమ్మ పండగ కోసం మేకను ఖరీదు చేయడానికి బయలు దేరిన కుటుంబ సభ్యులు ఆటో బేతోలు శివారు తండా దాటుతుండగా ముందు నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్క సారిగా సడెన్ బ్రేక్ వేయడంతో బస్సును ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్నఅమలాదేవి అనే మహిళకు తీవ్రంగా గాయాలు కాగా మిగతా వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడ్డ వారిని మహబూబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా తీవ్రంగా గాయపడ్డ అమలాదేవి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అమలాదేవికి నాలుగేళ్ల గౌతం ఏడాదిన్నర వయసున్న గగన్ అనే మగపిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న కురవి ఎస్సై గుండ్రాతి సతీష్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
…………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
