* టూరిజం ప్లాజా హోటల్లో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలు
* ఆహార నాణ్యత పరిశీలన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna rao ) హెచ్చరించారు. బేగంపేట టూరిజం ప్లాజా హోటల్(Tourisim Plaza Hotel) లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్లో ఆహార పదార్థాలు, కిచెన్‌ను పరిశీలించారు.అల్ఫాహారం చేస్తున్న పర్యాటకులు, అతిథిలతో మంత్రి జూపల్లి మాట్లాడారు. ఆహారం నాణ్యత, రుచి గురించి ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పర్యాటకులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని హోటల్స్ నిర్వాహకులకు తెలిపారు. ప్రభుత్వం ఆదాయం పెంచడంతో పాటు పర్యాటకులు, అతిథుల కోసం మెరుగైన సౌకర్యాలు, వసతుల కల్పనపై ప్రదానంగా దృష్టి పెడుతున్నామని అన్నారు. ఆహ్లాదకరమైన వాతారణం ఉండేలా హరిత హోటల్స్ ను తీర్చిదిద్దుతామని చెప్పారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
