* అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
* టేకాఫ్ కు ముందే సర్వీసు రద్దు
* ఘోర ప్రమాదం తర్వాత ఎగిరేందుకు సిద్ధమైన తొలి విమానం ఇదే
ఆకేరు న్యూస్, డెస్క్ : అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద దృశ్యాలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఏకంగా 279 మంది ప్రాణాలు కోల్పోయిన తాలూకు హృదయ విదారక దృశ్యాలు ఇప్పటికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దీంతో విమాన ప్రయాణంపై తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా అహ్మదాబాద్(ahmedabad)లోనే మరో విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. అహ్మదాబాద్ నుంచి లండన్(ahmedabad to london)కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం రావడంతో రద్దు చేశారు. టేకాఫ్ కంటే ముందే సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. AI-159 విమానాన్ని రద్దు (flight cancelled) చేసినట్టు అధికారులు ప్రకటించారు. అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం తరువాత లండన్‌కు వెళ్తున్న తొలి విమానం ఇదే. అయితే సాంకేతిక లోపంతో విమానాన్ని రద్దు చేశారు. టేకాఫ్ కంటే ముందే సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
……………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
