ఆకేరున్యూస్, తాడ్వాయి : మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల
బాలికలకు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులు చట్టాలు అనే అంశంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు చట్టాలపై అవగాహన కలిగిఉండాలన్నారు. పోలీసులు,విధులు బాధ్యతలు ,చట్టాలు ,సైబర్ నేరాలు ,ఫోక్సో చట్టం, మాదక ద్రవ్యాల వినియోగం, వాటి వలన కలిగే అనర్ధాలు మొబైల్ ఫోన్ వాడకం, సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన కల్పించారువిద్యార్థినిలు ఉన్నత చదువులు చదవాలని తమ లక్ష్యాలను సాధించుకొని అభివృద్ధి చెందాలని సూచించారు . క్రీడలు మానసిక వికాసానికి ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడతాయని వివరించారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల విద్యార్థినీలు ఉపాధ్యాయులు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
