* అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని
ఆకేరు న్యూస్, జనగామ: ప్రభుత్వం దగ్గర అభివృద్ధి పనులకు నిధులు పుష్కలంగా ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని పనులు సత్వరమే పూర్తి చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధికారులకు ఆదేశించారు. బుధవారం పాలకుర్తి మండల పరిధిలోని గ్రామాల్లో సిఆర్ఆర్ నిధుల ద్వారా మంజూరైన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేసిన పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని,పల్లెలో సురక్షితమైన రహదారులు, తగిన పారిశుధ్య వసతులు లేకుండా మన ప్రజల ఆరోగ్య భద్రత సాధ్యం కాదని, అందుకే సిఆర్ఆర్ నిధుల ద్వారా మంజూరైన ఈ పనులు త్వరితగతిన, నాణ్యతతో పూర్తి కావాలని, ప్రతి గ్రామానికి అవసరమైన వసతుల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కారాలు చూపడమే ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత అని, అభివృద్ధి కొనసాగించేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, పాలకుర్తి ఏఎంసీ చైర్మెన్ మంజుల నాయక్, మండల అధ్యక్ష కార్యదర్శులు గిరగాని కుమార స్వామి, బైరు భార్గవ్, యూత్ అధ్యక్షుడు హరీష్, నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, మహ్మద్ మదర్, యాకాంతరావు, మొలుగూరి యాకయ్య, ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు, అధికారులు, గ్రామ పెద్దలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,యువజన నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
