* అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్
ఆకేరు న్యూస్, జనగామ: అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని జనగామ జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం జనగామ పట్టణంలోని కోర్టు వద్ద ఉన్న బాలికల జిల్లా పరిషత్ హై స్కూల్ ను జిల్లా విద్యాశాఖ, మండల విద్యాశాఖ రోడ్లు భవనాల శాఖ అధికారుల తో కలిసి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం లింగాల గణపురం మండలం నేలపోగుల గ్రామపంచాయతీ లోని ప్రీ ప్రైమరీ స్కూల్ ను సందర్శించి స్కూల్ కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అదే స్కూల్ ఆవరణలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. అంగన్వాడి కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నందున విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి భోజయ్య, మండల విద్యాశాఖ అధికారి, రోడ్లు భవనాల శాఖ అధికారులు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
