* పరిశీలిస్తున్న హైడ్రా అధికారులు
* సిద్ధవుతున్న ప్రణాళికలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ః చర్లపెల్లి చెరువును సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రంగం సిద్దమవుతోంది. ఈ మేరకు హైడ్రా అధికారులు నిర్ణయం తీసుకున్నారు,
మొత్తం 58 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును ఆధునీకరించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. పర్యావరణ అనుకూలతను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాన్ని పర్యాటక ఆకర్షణగా మలచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ, నీటిపారుదల, జీహెచ్ఎంసీ (GHMC), జైళ్ల శాఖ అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. చెరువు పరిశుభ్రత, జీవవైవిధ్య పరిరక్షణ, మరియు ప్రజలకు విశ్రాంతి ప్రదేశంగా మార్చే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేయడం,చెరువు కట్టను మరింత బలోపేతం చేసి అందంగా తీర్చిదిద్దడవ,వాకర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు,చెరువు పరిసరాల్లో పిల్లల కోసం పార్కుల ఏర్పాటు, మొదలైనవి చేయనున్నారు.ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, “ఈ చెరువు హైదరాబాద్కు ఒక సహజ వనరుగా ఉండటంతోపాటు పర్యాటక అభివృద్ధికి అనేక అవకాశాలు కలిగి ఉంది. జీవవైవిధ్యం రక్షణకూ ఇది ఒక ఉదాహరణగా మారుతుంది” అని అన్నారు.ప్రాజెక్టు కార్యాచరణపై సమగ్ర డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల సహకారంతో ఈ ప్రాజెక్టును త్వరితగతిన ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
