* ఏడాదికి రెండు సార్లు ఇంజక్షన్ వేసుకోవాలి
* 99.9 శాతం రక్షణ
* బాధితులకు శుభవార్త
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సమాజాన్ని పట్ట పీడిస్తున్న హెచ్ైవీ వ్యాధికి ఎట్టకేలకు నివారణ మందును కనుగొన్నారు. హెచ్ ఐ వీ సోకిన వాళ్లు ఇక జీవితం అయిపోయింది అని నిరాశతో కృంగిపోయేవారు. ఇక ముందు హెచ్ ఐవీ వ్యాధి సోకినా ప్రాణభయం లేదంటున్నారు వైద్యనిపుణులు.యెజ్ టుగో బ్రాండ్‌తో తయారైన లెనకాపవిర్ అనే మెడిసిన్ హెచ్ఐవీ నుంచి 99.9శాతం రక్షణ అందిస్తున్నదని దాన్ని అభివృద్ధి చేసిన సంస్థ గిలియడ్ సైన్సెస్ వెల్లడించింది. లెనకాపవిర్ ఔషధానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ( US Food and Drug Administration (FDA)ఆమోదం లభించిందని తెలిపింది. ఈ ఔషదాన్ని ఏడాదికి రెండు సార్లు అంటే.. ఆరు నెలలకు ఒకసారి ఇంజెక్షన్ రూపంలో తీసుకోవటం ద్వారా హెచ్ఐవీ నుంచి 99.9శాతం రక్షణ పొందవచ్చునని గిలియడ్ సైన్సెస్ సంస్థ వెల్లడించింది. పెద్దలు, కౌమారదశలో ఉన్నవారిలో హెచ్ఐవీ సంక్రమణ ప్రమాదాన్ని లెనాకాపావిర్ తగ్గిస్తుందని తేలినట్లు సంస్థ తెలింది. ఈ ఔషదంపై రెండు ట్రయల్స్ నిర్వహించారు. తొలి ట్రయల్.. సబ్‌సహారా ఆఫ్రికాలో 2వేల కంటే ఎక్కువ మంది మహిళలతో నిర్వహించడం జరిగిందని, దీని ఫలితంగా ఇన్పెక్షన్లు 100శాతం తగ్గాయని సంస్థ తెలిపింది. రెండో ట్రయల్ లో భాగంగా 99.9శాతం నివారణ రేటు నమోదైందని వెల్లడించింది. అయితే, ఈ కొత్త మెడిషన్ ధర మాత్రం భారీగా ఉంది. ఈ మెడిసిన్ ధర రూ.20.80లక్షల నుంచి 32.50లక్షలుగా ఉండనుందని సమాచారం.
……………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
