* పూర్తి స్థాయి రిపోర్ట్ అందించాలని ఆదేశం
* ఇరు వర్గాలనుండి ఫిర్యాదుల స్వీకరణ
* రిపోర్ట్ ఆధారంగా క్రమశిక్షణ చర్యలు
* ఇతరుల శాఖల్లో కల్పించుకోరాదని మంత్రులకు ఆదేశం
*అజారొద్దిన్ పై నో కామెంట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తీరుపై పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు.వరంగల్ లో జరిగిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో కొండా మురళి స్వంత పార్టీ నేతలపై చేసిన విమర్శలు దుమారం లేపాయి. క్రమశిక్షణను ఉల్లఘించి ఆయన వ్యవహరించారని పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కొండా మురళి వ్యక్తిగత దాడి చేశారు. ఈ నేపధ్యంలో ఇరు వర్గాల నుంచి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదులు వెళ్లాయి. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన తరువాత క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే మంత్రులు ఇతర మంత్రుల శాఖలపై కామెంట్స్ చేయరాదని ఆదేశించారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.. ఇదిలాఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అజారుద్దీన్ వెలిబుచ్చిన అభిప్రాయాన్ని మహేష్ కుమార్ తప్పుపట్టలేదు. ఇటీవల చనిపోయిన జూబ్లీహిల్స్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అజారుద్దీన్‌పై గెలిచిన విషయం తెల్సిందే.. అయితే రానున్న ఉప ఎన్నికల్లో అజారుద్దీన్ టికెట్ ఆశించడంలో తప్పు లేదని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
